ఎట్టకేలకి రామ్ చరణ్ రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రావడమే కాకుండా ఆ చిత్రం విడుదల తేదీని (మార్చి 30) కూడా ప్రకటించేసింది. అయితే ఇందులో ఇబ్బందేమిటి అని మీరు అనుకోవచ్చు.
సరిగ్గా ఈ చిత్రం విడుదలయ్యే ఒక్కరోజు ముందు అంటే 29 మార్చి రోజు మహానటి సావిత్రి జీవితాధారంగా చేసుకుని చేసిన చిత్రం ‘మహానటి’ విడుదల కానుంది. దీనితో ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.
వాస్తవానికి ఈ రెండు చిత్రాలు దేనికదే వైవిధ్యమైనప్పటికి ఇలా భారీ అంచనాలతో విడుదలయ్యే చిత్రాలు ఇలా గ్యాప్ లేకుండా విడుదల అవుతే రెండిటి బిజినెస్ దెబ్బతింటుంది అన్నది నిర్వివాదాంశం. ఇప్పటికే ఏప్రిల్ 27న మహేష్ భరత్ అను నేను అలాగే అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యే పరిస్థితి నెలకొన్నది.
భవిష్యత్తులో అయినా ఇటువంటి క్లాష్ రిలీజులతో నష్టపోకుండా చూసుకోవాల్సిన భాద్యత నిర్మాత-దర్షకుల పై ఉంది.