రంగస్థలం 1985 చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
అయితే ఆ ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ మాత్రం అచ్చం ఒక అమాయకుడైన, భోలా మనస్తత్వం కలిగిన పల్లెటూరి కుర్రాడిగా కనిపిస్తున్నాడు. లుంగీ, గళ్ళ చొక్కాతో నృత్యం చేస్తున్న ఈ మెగా పవర్ స్టార్ ఇప్పుడు మాస్ పవర్ స్టార్ గా కనువిందుచేయన్నున్నాడు.
ఇదిలావుండగా రంగస్థలం 1985 కథకి సంబందించిన అప్పటి కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా రామ్ చరణ్ స్టైలింగ్ జరిగింది అన్న విషయం ఇట్టే తెలిసిపోతున్నది. ఇక ఈ ఫస్ట్ లుక్ తో పాటుగా రిలీజ్ తేదీని కూడా చెప్పేయడంతో అభిమానులకి డబల్ బోనస్ ఇచ్చినట్టయింది.
మొత్తానికి ప్రేక్షకుల అంచనాలకి కథా పరంగా కూడా న్యాయం చేస్తున్నట్టుగా ఉంది ఈ చిత్రం ఫస్ట్ లుక్.