'అందాలు - దెయ్యాలు' గెలుపెవరిది?

మరిన్ని వార్తలు

ఓ పక్క అందాలు, మరో పక్క దెయ్యాలు, రెండింటి మధ్యా పోటీ. గెలిచేదెవరు? ఇదే 'అంతకుమించి'. కథేంటంటే, అమ్మాయిలతో పాటు, దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మే కుర్రోడు, దెయ్యాలు లేవని వారించే అమ్మాయి, ఇలాంటి రెండు భిన్న మనస్తత్వాల మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది? అదే 'అంతకుమించి' సినిమా కథ. 

రష్మీలాంటి హాట్‌ బ్యూటీని హీరోయిన్‌గా పెట్టి, రూపొందిస్తున్న సినిమా ఇది. కొత్త హీరో జై నటిస్తూ నిర్మిస్తున్నాడు. రష్మీ హాట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఎందుకో 'అంతకుమించి' సినిమాకి సంబంధించి రష్మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె విచ్చలవిడి అందాలారబోతే. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్‌ అన్నీ రష్మీ అందాల చుట్టూనే జరుగుతున్నాయి. సినిమాలో ఏముందో ఏమో కానీ, పోస్టర్స్‌పై రష్మీ అందాలతో కిర్రాకు పుట్టించేస్తున్నారు. దాంతో ఈ సినిమాకి యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

చాలు కదా. రష్మీ సినిమాకి యూత్‌ ఎట్రాక్షన్‌. ప్రజెంట్‌ అసలే యూత్‌ని టార్గెట్‌గా చేసుకునే సినిమాలు రూపొందుతున్నాయి. ఎందుకో తెలియదు కొన్ని చిత్రాలు ఆ టార్గెట్‌ని అందుకునే విజయాలు సాధించేస్తున్నాయ్‌. అలా రష్మీ అందాల అస్త్రం 'అంతకు మించి' సినిమాకి సక్సెస్‌ ఇచ్చిదంటే ఆమెకు పండగే. హీరోయిన్‌గా వరుసపెట్టి పలు చిత్రాల్లో నటించేసింది. కానీ రష్మీకి అవేమీ ఆశించిన రిజల్ట్‌ని అందించలేదు. కానీ రష్మీ ఆశలన్నీ 'అంతకుమించి' సినిమాపైనే పెట్టుకుంది. 

ఈ సినిమా కోసం కేవలం అందాలారబోతే కాకుండా, పర్‌ఫామెన్స్‌ వైజ్‌గా కూడా చాలా కష్టపడ్డానంటోంది అందాల రష్మి. ఏమో చూడాలి రష్మి కష్టం ఫలిస్తుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS