దాదాపుగా ఆరు రోజుల పాటు కొనసాగిన థియేటర్ల బంద్ మొన్న గురువారంతో ముగిసింది. ఇక నిర్మాతల మండలికి-డిజిటల్ ప్రొవైడర్లకి జరిగిన చర్చలు పూర్తిగా సఫలం కానప్పటికి మధ్యంతరంగా ఒక పరిష్కారానికి వచ్చి థియేటర్ల బంద్ ని నిలిపివేశారు.
అయితే తమిళ నిర్మాతల మండలి మాత్రం తమ డిమాండ్లని వెనక్కి తీసుకోకుండా సమ్మేని కొనసాగించడానికి నిర్ణయించారు. ఇక వీరికి తోడుగా థియేటర్ల యజమానులు సైతం వారికి అక్కడ ప్రభుత్వం నుండి అందాల్సిన రాయితీల విషయంలో సంతృప్తిగా లేరు.
దీనితో వారు కూడా ఈ నెల 16నుండి తమిళనాట థియేటర్లని బంద్ చేయడానికి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒక ప్రకటనని కూడా వారు విడుదల చేయడం జరిగింది. ఇక షూటింగ్ లు కూడా ఆరోజు బంద్ చేయనున్నట్టు ప్రాధమికంగా అందుతున్న సమాచారం.
తమిళనాట సినీ అభిమానులకి ఇది చేదు వార్తే..