హాట్ బ్యూటీ రేష్మీకి వెండితెరపై పాపులారిటీ వచ్చిందే గ్లామర్ పాత్రలతో. ఈ ముద్దుగుమ్మ నటించింది ఎక్కువగా హారర్ కామెడీ చిత్రాలే అయినా కానీ వాటిలో అమ్మడి అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో 'కరెంట్' తదితర చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్‌లో నటించింది. బుల్లితెరపై ఓ తెలుగు సీరియల్‌లోనూ నటించింది గతంలో. ప్రస్తుతం రన్ అవుతున్న 'జబర్దస్త్' షో ద్వారా బాగా పాపులారిటీ దక్కింది ఈ ముద్దుగుమ్మకి. వెండితెరపై 'గుంటూర్ టాకీస్' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. కాగా ఈ ముద్దుగుమ్మ వరుసగా హారర్ కామెడీ చిత్రాలే చేయడంతో హారర్ కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ, అందులో ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా చేయడం వల్ల సెక్స్ బాంబ్ అంటూ పేరొచ్చేసింది. అయితే అలా అనిపించుకోవడమే రేష్మికి ఇష్టం. కానీ అది గతం. ఇప్పుడు అలా అనిపించుకోవడానికి రేష్మీ ఇష్టపడడం లేదట. ఇకపై ఎక్స్‌పోజింగ్ క్యారెక్టర్స్ కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటానంటోంది. అలాగే ఎక్స్‌పోజింగ్ చేసినా కానీ, అది పాత్రకు అవసరమైనంత మేరకే చేశాను కానీ, ఎప్పుడూ గీత దాటలేదంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 'నెక్స్ట్ నువ్వే' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఎక్స్‌పోజింగ్‌కి చోటు లేదట. నటనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందంటోంది. అంతేకాదు ఇంతవరకూ మోడ్రన్ దుస్తులు, టూ పీసెస్ డ్రస్సుల్లో దుమ్ము రేపేసిన ఈ హాట్ బ్యూటీ ఎక్కువగా చీరల్లో కనిపిస్తుందట ఈ సినిమాలో. యంగ్ హీరో ఆది హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రేష్మీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ఇది కూడా హారర్ కామెడీ మూవీనే. కానీ కామెడీ కొత్తగా ఉంటుంది.