చిన్న సినిమా పై శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

ఎల్లుండి విడుదల కానున్న నీది నాది ఒకే కథ సినిమా పైన దర్శకుడు శేఖర్ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈయన కోసం ఈ చిత్ర యూనిట్ ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమా చూసిన ఆయన తన స్పందన ఈ క్రింది విధంగా తెలియచేశారు.

ఇది మనందరి కథ.. చాలా అవసరమైన కథ. చాలా పరిణితితో తెరకెక్కించిన దర్శకుడు వేణుకి హ్యాట్సాఫ్. శ్రీ విష్ణు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని రాయలసీమ యాస డైలాగ్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి కూడా అంటూ తన మనసులోని మాట చెప్పాడు.

ఇక శేఖర్ వంటి మంచి అభిరుచి కలిగిన దర్శకుడు నుండి విడుదలకి ముందే ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఈ చిత్రానికి పాజిటివ్ కానుంది. అలాగే హీరో శ్రీ విష్ణు కూడా ఇంతలా తమ చిత్రాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

మరి ఎల్లుండి విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్నది ఇంకొక రెండు రోజుల్లో తేలిపోతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS