బాలీవుడ్‌లో వరుసగా బయోపిక్స్‌తో సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ తాప్సీ ఖాతాలో మరో బయోపిక్ వచ్చి చేరింది. గుజరాత్ అథ్లెట్ రష్మీ జీవిత ఆధారంగా తాజాగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆకర్ష ఖురాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మీ తన పరుగుతో గుజరాత్‌కి ఎన్నో పతకాలను సంపాదించి పెట్టింది. అందుకే ఆమెను గుజరాత్ ప్రజలు ముద్దుగా 'రాకెట్' అని పిలుచుకుంటారు. ఈ పాత్రలోనే తాప్సీ నటిస్తోంది.
'రష్మీ రాకెట్' అనే టైటిల్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌ని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేస్తూ 'తర్వాతి మిషన్‌కి తాప్సీ సిద్ధమైంది.. ట్రాక్‌పై పరుగులు తీస్తోంది..' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అక్షయ్ ట్వీట్‌తో ఈ మోషన్ పోస్టర్‌కి మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే తాప్సీ, అక్షయ్ కుమార్‌తో కలిసి 'మిషన్ మంగళ్' సినిమాలో నటించింది.
తాప్సీ, అక్షయ్‌తో పాటు, నిత్యామీనన్, సోనాక్షి సిన్హా, కీర్తి కులకర్ణి, విద్యాబాలన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్‌కి 200 కోట్ల వసూళ్లు సాధించి పెట్టింది. దీంతో పాటు, తాప్సీ 'సాండ్ ఖీ ఆంఖ్' చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా బయోపిక్ కావడం విశేషం. ఈ సినిమాలో తాప్సీ 60 ఏళ్ల షార్ప్ షూటర్ బామ్మ పాత్ర పోషిస్తోంది. తాప్సీతో పాటు, భూమి పడ్నేకర్ మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది ఈ సినిమాలో. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.