ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'సాహో' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు 'సాహో' విజయవంతం కావాలని ఆశిస్తూ, తమదైన శైలిలో సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఫ్యాన్స్‌నుద్దేశించి ఓ ట్వీట్ చేసింది. ప్రబాస్ ప్యాన్స్‌ని 'డై హార్డ్ ఫ్యాన్స్'గా అభివర్ణిస్తూ, సినిమాపై దుష్ప్రచారం చేయకండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి.
దగ్గర్లో ఉన్న ధియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. ఈ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడ్డాం. ఆ కష్టమంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. మా కష్టాన్ని గౌరవించి ధియేటర్స్‌కి వెళ్లి మాత్రమే సినిమా చూడండి.. అని స్వీట్‌గా వార్న్ చేసింది. చక్కనమ్మలు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా క్యూట్‌గానే ఉంటుంది. అలాంటిది శ్రద్ధా కపూర్ ఇంత స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చాక, ప్రబాస్ ఫ్యాన్స్ పైరసీ ఎందుకు చేస్తారు? ధియేటర్‌కి వెళ్లే సినిమా చూస్తారు.
కానీ, ఆకతాయిలు ఎప్పుడూ ఉంటారు. వారి ఆటలు కట్టేదెలా? ప్రీమియర్స్ పడుతున్నప్పుడే, పైరసీ వీడియోలు బయటికొచ్చేశాయి. క్షణాల్లో నెట్టింట్లో హల్‌చల్ చేసేశాయి. స్వీట్‌గా అయినా, హాట్‌గా అయినా ఎలాంటి వార్నింగ్స్ ఇచ్చినా ఈ పైరసీ భూతాన్ని ఆడ్డుకోవడం సాధ్యమేనా? ఇకపోతే 'సాహో' ఎలాంటి రిజల్ట్‌ని దక్కించుకుందో తెలియాలంటే ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాల్సిందే.