కెప్టెన్సీ కోసం బాబా భాస్కర్, వరుణ్, రాహుల్ మడ్ పిట్ యాక్షన్‌లో హోరా హోరీగా తలపడ్డారు. కానీ, కెప్టెన్సీ మాత్రం వరుణ్‌కే దక్కింది. స్వతహాగా బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన వరుణ్‌కి బురదలో నుండి కూడా బాల్స్‌ని గురి చూసి బాస్కెట్‌లో వేయడం సులువైంది. రాహుల్ మరోసారి టాస్క్ ఫెయిలయ్యాడు. తనవంతుగా బాబా భాస్కర్ ప్రయత్నించాడు కానీ, విఫలమయ్యాడు.
ఇదిలా ఉంటే, ఈ టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే బాబా భాస్కర్ చాలా సేపు హౌస్‌మేట్స్‌తో పాటు, వీక్షకుల్ని కూడా ఎంటర్‌టైన్ చేశారు. తాను కెప్టెన్ అయితే, హౌస్‌లోని ఆడవాళ్లు షార్ట్ డ్రస్సులు వేసుకోవడం నిషేధం, చుడీదార్స్, శారీలు మాత్రమే ధరించాలని రూల్ పెడతాను.. అని బాబా భాస్కర్ హౌస్‌మేట్స్‌కి సూచించిన తీరు ఆకట్టుకుంది. అలాగే బిగ్‌బాస్ బాద్‌షా అలీ స్నానం చేసి బెడ్ షీట్ చుట్టుకుని రావాలి, లేదంటే, వాష్ రూమ్‌లోనే ప్యాంట్, షర్ట్ ధరించి రావాలి తప్ప షర్టు లేకుండా హౌస్‌లో తిరగకూడదు.. అని పర్టిక్యులర్ రూల్ పెట్టాడు.
ఇలా ఈ వారం స్టార్టింగ్ నుండీ బోరింగ్‌గా సాగిన బిగ్‌బాస్ శుక్రవారం ఎపిసోడ్ బాబా భాస్కర్ పర్‌ఫామెన్స్‌తో ఒకింత ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. అంత బిల్డప్ ఇచ్చినా, పాపం బాబా భాస్కర్‌కి కెప్టెన్సీ దక్కలేదు. రెండోసారి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ బాధ్యతలు తీసుకున్నాడు. తొలిసారి కెప్టెన్సీలో విఫలమై, జైలుకుె కూడా వెళ్లిన వరుణ్ సందేశ్, ఈ సారి కెప్టెన్‌గా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి బిగ్‌బాస్ మెప్పు పొందుతాడేమో చూడాలిక.