నితిన్‌ కోసం రష్మిక: ప్రమోషన్స్‌ అప్పుడే మొదలెట్టేసింది.

By iQlikMovies - August 13, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

ఛాటింగ్స్‌ పేరు చెప్పి, సినిమాని ప్రమోట్‌ చేయడంలో రష్మికా మండన్నా ప్రత్యేకతే వేరు. గతంలో 'గీత గోవిందం' టైంలో విజయ్‌ దేవరకొండతో రష్మికా ఇలాగే ఫన్నీ ఛాటింగ్స్‌ చేస్తూ ఫ్యాన్స్‌కి స్పెషల్‌ కిక్‌ ఇచ్చేది. ఆ ఫన్నీ ఛాటింగ్స్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించేవి. అప్పుడప్పుడూ రొమాంటిక్‌ యాంగిల్‌లో కూడా వీరిద్దరి మధ్యా ఛాటింగ్స్‌ జరుగుతుండేవి. కానీ, అవన్నీ సినిమా ప్రమోషన్స్‌లో భాగమే అని ఆ తర్వాత వారిరువురూ చెప్పుకొచ్చారనుకోండి అది వేరే విషయం.

 

ఇక తాజాగా రష్మిక, నితిన్‌ కోసం ఈ స్పెషల్‌ టెక్నిక్‌ని ప్లే చేసిందండోయ్‌. నితిన్‌, రష్మిక జంటగా 'భీష్మ' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ఛలో' ఫేం వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు. తాజాగా ఆన్‌ సెట్స్‌ నుండి ఓ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, 'నేను, నితిన్‌ అన్నా సినిమా గురించి సీరియస్‌గా మాట్లాడుకుంటున్నాం. మా వెనక రష్మిక ఏం చేస్తుందో మాకు తెలీదు..' అంటూ ఫన్నీగా కామెంట్‌ పెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ పోస్ట్‌కి రష్మిక స్పందిస్తూ, మీరు, నితిన్‌ సెట్స్‌లో ఏం చేస్తున్నారో మీ ఫోటోలు బయట పెట్టనా.? అని ఫన్నీగానే హెచ్చరికలు వదిలింది. మధ్యలో నితిన్‌ కూడా ఈ ఛాటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు.

 

మేమిద్దరం అయితే, సినిమా గురించే డిస్కస్‌ చేస్తుంటాం. కానీ, నువ్వు, వెంకీ ఎవరితో ఫేస్‌ టైంలో మాట్లాడుతుంటారు.? అని అడిగాడు. అందుకు 'నేనింకా సింగిలే..' అనే ట్యాగ్‌ నాకు మాత్రమే వర్తిస్తుంది.. అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. ఇలా ఈ ముగ్గురి మధ్యన జరిగిన ఈ ఛాటింగ్‌ తతంగం సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే, రష్మిక, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS