రష్మిక 'సూపర్‌' కాంప్లిమెంట్‌ కొట్టేసిందిలే.!

మరిన్ని వార్తలు

మహేష్‌ ఇంతవరకూ చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించారు. లేటెస్ట్‌గా ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలో రష్మిక - మహేష్‌బాబు జంట అందర్నీ ఆకట్టుకుంటోంది. 'హి ఈజ్‌ సో క్యూట్‌..' అంటూ మహేష్‌ని పొగిడేస్తూ పాడిన పాటతో రష్మిక క్యూట్‌ అప్పీల్‌ యూత్‌కి కిర్రాక్‌ అనిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో రష్మికకు డాన్స్‌ చేసే అవకాశం కూడా కలిగింది. 'మైండ్‌ బ్లాక్‌..' సాంగ్‌లో రష్మిక డాన్స్‌ స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే.

 

అందుకేనేమో, రష్మిక ప్రస్తుతం తనకు ఫేవరేట్‌ కో స్టార్‌ అని మహేష్‌ నోటి వెంట వచ్చిందేమో. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అంతటోడు తనను ఫేవరేట్‌ కో స్టార్‌ అంటే, రష్మికకు అంతకన్నా బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇంకేముంటుంది చెప్పండి. పట్టరాని ఆనందంతో భూమ్మీద నిలవలేకపోతోందట రష్మిక. అసలే రష్మికకు 'సరిలేరు..' మూవీ ఓ స్పెషల్‌ మూవీ. అందునా మహేష్‌తో కలిసి రష్మిక చేస్తున్న ప్రమోషన్స్‌ కూడా వెరీ వెరీ స్పెషల్‌గా ఫీలయిపోతోంది. ఈ సిట్యువేషన్‌లో మహేష్‌తో ఫేవరేట్‌ కో స్టార్‌ అనిపించుకుందంటే, రష్మిక అదృష్టం మామూలుగా లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే, రష్మిక నటించిన 'భీష్మ' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నితిన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS