లేటెస్ట్ అప్డేట్: 'ఆర్ ఆర్ ఆర్' లో సుదీప్ పాత్ర ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కన్నడ నటుడు సుదీప్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం 'ఈగ'లో సుదీప్‌ కీలక పాత్ర పోషించాడు. తర్వాత సెంటిమెంట్‌గా 'బాహుబలి'లో ఓ చిన్న పాత్ర ఇచ్చి సుదీప్‌ని మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. గతేడాది 'సైరా నరసింహారెడ్డి'లో అవుకు రాజుగా కీలక పాత్ర పోషించి ఆడియన్స్‌ మెప్పు పొందాడు సుదీప్‌. ఇలా ఏదో ఒకరకంగా తెలుగు ఆడియన్స్‌ని తనదైన నటనతో సుదీప్‌ మెప్పిస్తూనే ఉన్నాడు.

 

తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో సుదీప్‌ కోసం రాజమౌళి ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ని చెక్కినట్లు తెలుస్తోంది. అది పవర్‌ఫుల్‌ బ్రిటీష్‌ పోలీసాఫీసర్‌ పాత్రనీ ప్రచారం జరుగుతోంది. అరతేకాదు, ఈ పాత్ర పలు వేరియేషన్స్‌తో కూడుకున్నదట. అందుకే అలాంటి పాత్రలో సుదీప్‌ వంటి నటుడైతే ప్రాణం పెట్టగలడని ఏరి కోరి జక్కన్న ఈ పాత్రకు సుదీప్‌ని తీసుకున్నాడట. చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తానూ ఓ భాగం కావడం, తనకెంతో సంతోషంగా ఉందని సుదీప్‌ అంటున్నాడు. ఇకపోతే, కన్నడలో సుదీప్‌ చాలా చాలా బిజీయెస్ట్‌ హీరో. వరుస ప్రాజెక్టులతో అక్కడ బిజీగా ఉంటూనే, తెలుగు ప్రేక్షకుల కోసం అప్పుడప్పుడూ ఇక్కడ కూడా అలా అలా తళుక్కున మెరుస్తున్నాడు. కీలక పాత్రల్లో సుదీప్‌ కనిపిస్తుండడం తెలుగు అభిమానుల్లో సుదీప్‌కి చెప్పుకోదగ్గ గుర్తింపు దక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS