చేపలకు ఈత నేర్పగలమా? ఈతరం కథానాయికలకు ప్రేమ వ్యవహారాలలో చిట్కాలు ఇవ్వడమూ అంతే. డేటింగ్ గట్రా లాంటి విషయాల్లో వాళ్లే తిరిగి పాఠాలు చెబుతుంటారు. అలాంటిది రష్మిక ఈమధ్య అమాయకంగా ఓ ప్రశ్న వేసింది. `డేటింగ్ అంటే ఏమిటి?` అంటూ. దానికి సినీ జనాలు పగలబడి నవ్వేస్తున్నారు. మరి కాదా...? సినిమాల్లో వచ్చీ రావడంతోనే, ప్రేమలో పడిపోయింది. ఆ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆ ప్రేమ పెటాకులు అయ్యింది కాబట్టి సరిపోయింది.. లేదంటే.. రష్మికకు ఈపాటికే పెళ్లయిపోదును.
ఇప్పుడు కూడా రష్మిక ఖాళీగా లేదు. ఓ యువ హీరోతో లవ్వాట ఆడేస్తుందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. అయినా సరే.. `డేటింగ్ అంటే ఏమిటి? డేటింగ్ కి వెళ్లి ఏం చేస్తారు` అని అమాయకమైన ప్రశ్నలు అడుగుతోంది. ఇదంతా తెలిసా? తెలియక..? లేదంటే జనాలకు తెలిసో లేదో అని అనుమానంతోనా? ఏంటో రష్మిక మాటలకు అర్థాలే వేరు.