'ఛలో' సినిమాతో హిట్ కొట్టి, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మికా మండన్నా. ప్రస్తుతం యంగ్ హీరోస్ అందరికీ మెయిన్ ఛాయిస్‌గా మారిందీ భామ. ఆల్రెడీ నాని, శర్వానంద్ తదితర హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం విజయదేవరకొండతో 'గీత గోవిందం' చిత్రంలో నటిస్తోంది. ఆగష్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టర్లు సందడి చేస్తున్నాయి. అందులో ఓ ఫోటో చూసి నెటిజన్లు అమ్మడిపై కామెంట్స్ గుప్పిస్తున్నారు. ఆల్రెడీ కన్నడ హీరోతో రష్మికాకి ఎంగేజ్‌మెంట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్యా ఒక అండర్ స్టాండ్ ప్రకారం సినిమాలను ఒప్పుకుంటోంది. వీలైనంత త్వరలో కంప్లీట్ చేసి వస్తానని తన ఫీయాన్స్ దగ్గర మాట తీసుకుంది రష్మికా. ఆ కోవలోనే ఒప్పుకున్న సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది.
ఈ విషయంలో అమ్మడిని మెచ్చుకునే వారు కొందరైతే, మరికొందరు మాత్రం రష్మికాపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ పక్క ఎంగేజ్‌మెంట్ చేసుకుని మరోపక్క ఆన్‌స్క్రీన్ రొమాన్స్ ఎలా చేస్తున్నావ్ అంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రొటీనే అయినా కాస్త ఘాటుగానే అనిపించింది ఈ విషయంలో రష్మికా స్పందన. పెళ్లి తర్వాత హీరోలు రొమాన్స్ చేస్తే చూస్తారా? హీరోయిన్లు చేస్తే ఎందుకు చూడరు.? హీరోయిన్లు కూడా మనుషులే. హీరోలకు దక్కుతున్న గౌరవాన్ని హీరోయిన్స్ విషయంలో ఎందుకు మర్చిపోతున్నారు.?
అంటూ ఇలా ట్రోలింగ్ చేసేవారు ఖచ్చితంగా తన ఫ్యాన్స్ అయితే కాదనీ, యాంటీ ఫ్యాన్స్ మాత్రమే ఇలాంటి అనవసర ట్రోలింగ్స్‌కి పాల్పడుతున్నారన్న సంగతి తనకు తెలుసనీ రష్మికా మండిపడింది.