పవన్ కళ్యాణ్ సినిమా రీమేక్ లో విజయ్ దేవరకొండ

మరిన్ని వార్తలు

టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీరు చదివిన టైటిల్ నిజమే!

పూర్తి వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం తమిళ రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. లైకా ప్రొడక్షన్స్ ఇప్పటికే రజినీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రాన్ని నిర్మించగా త్వరలోనే అత్తారింటికి దారేదిని తమిళంలో రీమేక్ చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం.

అయితే ఈ చిత్రంలో హీరోగా తెలుగు హీరో విజయ్ దేవరాకొండని తీసుకునేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం. విజయ్ ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఆయన ఇప్పటికే NOTA అనే చిత్రాన్ని తెలుగు-తమిళ బాషలలో చేస్తున్నారు అలాగే విజయ్ చేసిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని కూడా తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

దీన్నిబట్టి తమిళంలో విజయ్ కి  మంచి మార్కెట్ ఉందని అర్ధమవుతుంది. అందుకనే ఈ అత్తారింటికి దారేది రీమేక్ లో విజయ్ ని తీసుకుంటే కలిసొస్తుంది అన్న భావన లైకా ప్రొడక్షన్స్ లో మొదలైంది అని అనుకోవచ్చు.

ఇక దీని పైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS