యంగ్‌ హీరోస్‌కి కిర్రాక్‌ పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ

మరిన్ని వార్తలు

కన్నడ సినిమా 'కిరిక్‌ పార్టీ'తో మంచి విజయం అందుకున్న బ్యూటీ రష్మికా మండన్నా. ఆ సినిమాతో కన్నడలోనే కాదు, తెలుగులో కూడా పాపులర్‌ అయిపోయిందీ ముద్దుగుమ్మ. తెలుగులో ఎంట్రీ ఇవ్వకుండానే అందరి నోళ్లలోనూ నానేసిందీ అందాల భామ పేరు. అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కించేసుకుందంటూ వార్తలు హాట్‌ హాట్‌గా చక్కర్లు కొట్టేశాయి టాలీవుడ్‌లో. 

అయితే అది జరగలేదు కానీ, యంగ్‌ హీరో నాగశౌర్యతో 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తన మొహం పరిచయం చేసింది రష్మికా మండన్నా. తొలి సినిమాతోనే అంచనాలకు తగ్గట్లుగానే విజయం అందుకుంది. యాక్టింగ్‌ టాలెంట్‌ కూడా ప్రదర్శించేసింది. ఇంకేముంది టాలెంట్‌ ఉండి, కాస్త టైం కలిసొస్తే ఆఫర్లు క్యూ కట్టేస్తాయని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. యంగ్‌ హీరోస్‌తో వరసపెట్టి సినిమాలు చేసేస్తోంది. 

ముందుగా సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండతో రెండు సినిమాల్లో నటిస్తోందీ భామ. విజయ్‌తో రష్మికా నటిస్తున్న 'గీతా గోవిందం' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయనతోనే 'డియర్‌ కామ్రేడ్‌' అనే చిత్రంలోనూ నటిస్తోంది. మరోవైపు తొలి సినిమా హీరో నాగశౌర్యతోనే మరో సినిమాకి సైన్‌ చేసిందట. 

ఇకపోతే తాజాగా నాని - నాగ్‌ మల్టీ స్టారర్‌లో నానికి జోడీగా నటిస్తోంది. ఫెస్టివల్‌ హీరో శర్వానంద్‌తోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. అక్కినేని హీరో నాగచైతన్యతోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతోందని వినికిడి. చూస్తుంటే ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది టైంలోనే అమ్మడు యంగ్‌ హీరోస్‌ అందర్నీ చుట్టేసేలానే ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS