రష్మిక... టాలీవుడ్ లోనే టాప్ స్టార్. తన చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. ఇప్పుడు హిందీలోనూ శరవేగంగా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకొనే కథానాయికల్లో తన పేరు కూడా ఉంటుంది. ఇటీవల `సీతారామం` కోసం మరో అవతారం ఎత్తింది. అఫ్రిన్ గా కథలో కీలకమైన పాత్రని పోషించింది. ఈ సినిమా విజయం సాధించడంతో రష్మిక ఆనందానికి అవధుల్లేవు. ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానంటోంది.
మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా అంటే.. చాలా పెద్ద చిట్టానే విప్పింది రష్మిక. ఓ బయోపిక్‌లో నటించాలని ఉందట. అయితే అది ఎవరి బయోపిక్కో చెప్పలేదు. స్పోర్ట్స్ డ్రామాలంటే తనకు ఇష్టమని అలాంటి సినిమా ఒకటి చేయాలని చెప్పుకొచ్చింది. అంతేకాదు... చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయాలని ఉందట. యాక్షన్, ఫైట్స్ కలబోసిన పాత్ర లో నటించాలని ఆశగా ఉందట.
రష్మిక కోరికల చిట్టా పెద్దదే ఉంది. త్వరలోనే అవన్నీ తీరతాయని, అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది రష్మిక.