రష్మికా - నాని జోడీ భలేగుంది బాస్‌.!

మరిన్ని వార్తలు

ఇప్పుడు టాలీవుడ్‌లో, హీరోయిన్స్‌లో ఎక్కువగా మార్మోగుతున్న పేరు రష్మికామండన్నా. తొలి సినిమా 'ఛలో'తో హిట్‌ కొట్టింది. తొలి సినిమాకే సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా 'గీతగోవిందం'తో సంచలన విజయం అందుకుంది. దాంతో అమ్మడికి క్రేజ్‌ అలా ఇలా లేదు. 

ఇకపోతే ముచ్చటగా మూడో సినిమా 'దేవదాస్‌'తో రాబోతోంది. ఈ సినిమా విజయంపై ముందుగానే అంచనాలు మొదలెట్టేశారు ఆమె అభిమానులు. నాగార్జున, నాని మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నానికి జంటగా రష్మికా నటిస్తోంది. ఇంతవరకూ నాని, రష్మికా కాంబినేషన్‌కి సంబంధించిన స్టిల్స్‌ ఏమీ విడుదల కాలేదు. కానీ వీరిద్దరి జంట సినిమాలో చాలా బాగుందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. 

ఇంతవరకూ రష్మికా నటించిన రెండు సినిమాల్లోనూ హీరోలకు జోడీగా చక్కగా సెట్‌ అయిపోయింది రష్మికా. పర్‌ఫామెన్స్‌ పరంగా మంచి మార్కులేయించుకుంటోంది. సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక పాల్గొంటున్న విధానం భలే ముచ్చటేస్తోంది. 'గీత గోవిందం' సినిమాకి సంబంధించి సోషల్‌ మీడియాలో 'గీవిందం గోవిందం..' అంటూ విజయ్‌ దేవరకొండను ఆటపట్టించిన తీరు సినిమాకి చాలా పెద్ద ప్లస్‌ అయ్యింది. 

అలాగే ఇప్పుడు 'దేవదాస్‌' సినిమా ప్రమోషన్స్‌ కోసం కూడా అమ్మడు రంగం సిద్ధం చేస్తోందట. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఓ టీజర్‌, ఓ లిరికల్‌ సాంగ్‌ విడుదలయ్యాయి. ఈ రెండింటికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నాగార్జున డాన్‌ పాత్రలోనూ, నాని డాక్టరు పాత్రలోనూ నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS