హీరోయిన్స్‌పై రూమర్స్ అంటే నెటిజన్స్‌కి చాలా చాలా క్యూరియాసిటీ. అందుకే పుట్టిందంటే చాలు పెరిగిందంటారు. ముఖ్యంగా, ప్రేమ, పెళ్లి తరహా వార్తల్లో వచ్చే గాసిప్స్ అంటే మరీ చెవులు కోసుకుంటారు.
అయితే తాజాగా రైజింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నాపై కొన్ని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీకి ఆల్రెడీ నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మికా మండన్నా నిశ్చితారం జరిగింది. రష్మిక కన్నడలో నటించిన 'కిరిక్ పార్టీ' సినిమా టైంలోనే కో స్టార్ రక్షిత్‌శెట్టితో స్నేహం చిగురించడం, ఆ స్నేహం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి దాకా చేరడం జరిగింది. ఆ తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు రక్షిత్‌తో నిశ్చితార్ధం జరిగింది.
కాగా ఇప్పుడు రష్మికా టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయింది. బిజీయెస్ట్ హీరోయిన్ అంటే ఏదో ఒక రకంగా పుకార్లు పుట్టుకొస్తాయి. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రష్మికా నిశ్చితార్ధం కాన్సిల్ అయ్యిందనీ, కెరీర్‌లో బిజీ కావడంతో, పెళ్లిని పక్కన పెట్టిందనీ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో రష్మికా సెక్రటరీ స్పందించాడు.
రష్మికా - రక్షిత్ శెట్టిల ప్రేమ చాలా గొప్పది. వారు విడిపోవడమనేది జరగదు. కెరీర్ పరంగా పెళ్లికి జస్ట్ చిన్న గ్యాప్ తీసుకున్నారంతే. తరచూ వారు కలుస్తున్నారు. ఈ మధ్యనే ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరయ్యారు. వీరి నిశ్చితార్ధం రద్దయ్యిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్మికా మండన్నా, విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.