శంకర్, ఎహ్సాన్, లాయ్ అనే మ్యూజిక్ త్రయం 'సాహో'కి మ్యూజిక్ అందించారు. అయితే ప్రస్తుతం వారు 'సాహో' మ్యూజిక్ నుండి తప్పుకుంటున్నాట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'సాహో' టీమ్ నుండి తప్పుకున్నా సినిమా మంచి విజయం దక్కించుకోవాలంటూ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారీ మ్యూజిక్ త్రయం. 'సాహో' నిర్మాతలు ఈ మ్యూజిక్ త్రయానికి థాంక్స్ చెప్పారు. వారితో ఇంతవరకూ చేసిన జర్నీని తలచుకుంటూ, వారితో పూర్తిగా కొనసాగలేనందుకు బాధపడుతూ అవకాశమొస్తే మళ్లీ మళ్లీ వారితో పని చేయాలని ఉందన్నారు.
ఈ మ్యూజిక్ త్రయం సాహో టీమ్ నుండి తప్పుకోవడానికి అసలు కారణాలేంటో తెలియవు కానీ, ఇదంతా చూస్తుంటే, ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్‌లోనే వీరు 'సాహో' టీమ్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయినా రిలీజ్ ముందు తప్పుకోవడమేంటీ.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే, 'సాహో' మ్యూజిక్ కోసం తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు గిబ్రాన్‌ని తీసుకున్నారని తెలుస్తోంది.
ఆల్రెడీ 'సాహో' ఛాప్టర్ 1, చాప్టర్ 2 కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు గిబ్రాన్. సో గిబ్రానే ఇకపై 'సాహో'కి మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడన్నమాట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాహో' చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకోవడంతో అనుకున్న టైంకి సినిమా విడుదలపై కొంత అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ గిబ్రాన్ దాదాపు ఓకే చేయడంతో విడుదలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదనీ నిర్మాణ సంస్థ నుండి తాజాగా అందుతోన్న సమాచారమ్.