రష్మికా ఆషామాషీ గాళ్‌ కాదండోయ్‌.!

మరిన్ని వార్తలు

'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. తొలి సినిమాకే క్రేజీ హిట్‌ కొట్టి, యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించింది. ఇదేం పెద్ద విషయం కాదనుకుంటే, తెలుగు దర్శక, నిర్మాతల మనసు కూడా గెలుచుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌ మోస్ట్‌ పాపులర్‌ నిర్మాతలు రష్మికా కోసం వెయిట్‌ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. 

ఇటీవల జరిగిన 'గీత గోవిందం' చిత్రం ఆడియో ఫంక్షన్‌కి వచ్చిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా రష్మికా గురించి కొంచెం ఎక్కువే చెప్పారు. బన్నీ రష్మికా గురించి మాట్లాడింది వింటే, తన నెక్ట్స్‌ సినిమా హీరోయిన్‌గా రష్మికానే కావాలంటాడేమో బన్నీ అనిపిస్తోంది కూడా. అంతేకాదు, 'గీత గోవిందం' సినిమా కోసం ఏరి కోరి రష్మికాని హీరోయిన్‌గా ఎంచుకున్నారట. ఆమె డేట్స్‌ ఖాళీ లేకపోతే, మూడు నెలలు ఎదురు చూసి మరీ ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారట. అంటే ఆ పాత్రపై రష్మికా ఎంత ప్రభావితం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇక ఆన్‌ స్క్రీన్‌ విజయ్‌ దేవరకొండ, రష్మికా జంట బాగా ఆకట్టుకునేలా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన పోస్టర్స్‌, వీడియోలు సినిమాపై ఆశక్తిని పెంచుతున్నాయి. క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఖచ్చితంగా 'గీత గోవిందం' చిత్రంతో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ అందించిన మ్యూజిక్‌ మెలోడీ అందర్నీ కట్టిపడేస్తోంది. 

ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది 'గీత గోవిందం'.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS