విజయ్‌ - రష్మికా ఈసారైనా సెట్‌ అవుతుందా?

మరిన్ని వార్తలు

కన్నడ భామ రష్మికా మండన్నాకు తెలుగులో తొలి సినిమా 'ఛలో'. ఈ సినిమా విజయంతో సంబంధం లేకుండానే రష్మికా బోలెడంత క్రేజ్‌ దక్కించుకుంది టాలీవుడ్‌లో. కన్నడ సినిమా 'కిరిక్‌ పార్టీ'తో కన్నడతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో కూడా రష్మికా పేరు మార్మోగిపోయింది. ఇక రెండో సినిమా 'గీత గోవిందం' విడుదలయ్యాక ఆ క్రేజ్‌ పీక్స్‌కి చేరుకుంది. ఇక అంతే, అక్కడితో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌ అయిపోయింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తోంది రష్మికా.

 

ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, అసలు సంగతేంటంటే, రష్మికా తమిళంలో స్టార్‌ హీరో విజయ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతందన్న పుకార్లు మొన్నామధ్య పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే వాటిని రష్మికా సున్నితంగా తిరస్కరించింది. ఆ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లడం, మరికొద్ది రోజుల్లో పూర్తి కావడం కూడా జరిగిపోతోంది. విజయ్‌కిది 64వ చిత్రం. అట్లీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి విజయ్‌ దర్శకత్వంలో రష్మికా అట.. అనే న్యూస్‌ గుప్పుమంటోంది.

 

కొత్త దర్శకుడితో విజయ్‌ ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఈ సినిమాకి రష్మికా హీరోయిన్‌ అయితే బావుంటుందని అనుకుంటున్నారట.. అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో హాట్‌ హాట్‌గా వైరల్‌ అవుతోంది. కానీ ఇందులో కూడా నిజం లేదని రష్మికా తేల్చేసింది. ఆల్రెడీ రష్మికా తమిళంలో కార్తి సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఈ గాలి వార్తలు నిజమై విజయ్‌తో రష్మికాకి జోడీ కుదిరితే ఫ్యాన్స్‌ దిల్‌ ఖుషీ అవుతుంది మరి. అందుకోసమైనా ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే బావుండు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS