అమ్మాయిలకు లవర్‌బోయ్‌లా, అబ్బాయిలకు రౌడీగా తన ఆటిట్యూడ్‌తో పిచ్చెక్కించేస్తున్న విజయ్ దేవరకొండ త్వరలో 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు, మన కామ్రేడ్ మరో రెండు మూడు సినిమాలనూ లైన్‌లో పెట్టేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి కొత్త డైరెక్టర్ ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో నటిస్తున్న 'హీరో' సినిమా కాగా, మరోటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరక్కెనుంది.
'మళ్లీ మళ్లీ రాని రోజు', 'ఓనమాలు' తదితర చిత్రాలతో ఫీల్ గుడ్ డైరెక్టర్ అనిపించుకున్న క్రాంతిమాధవ్ ఈ సారి విజయ్‌తో ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట. ఈ సినిమాలో హీరోని ప్లే బోయ్‌లా చూపించబోతున్నాడట. అంటే ఎక్కువమంది అమ్మాయిలను ఈజీగా తన లవ్‌లో పడేసే క్యారెక్టర్ అన్నమాట. ఎవరితోనూ ఎక్కువ కాలం లవ్‌ని కొనసాగించలేడట. కొన్నాళ్లకే 'బ్రేకప్' చెప్పేస్తుంటాడట. ఈ కాన్సెప్ట్ ఎప్పుడో విన్నట్లుంది కదా. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన 'ఆరెంజ్' సినిమా కాన్సెప్ట్‌ని తలపిస్తోంది ఈ స్టోరీ.
'ఆరెంజ్'లో రామ్‌చరణ్ ఏకంగా 9 మంది అమ్మాయిల్ని లవ్ చేస్తాడు. అయితే మన రౌడీ సినిమాలో మాత్రం ముగ్గురితోనే ఆపేస్తాడట. కానీ, మూడు లవ్‌స్టోరీస్‌నీ హృద్యంగా తెరపై ఆవిష్కరించనున్నాడట డైరెక్టర్ క్రాంతి మాధవ్. ఇక మన రౌడీ కామ్రేడ్ లవ్ స్టోరీస్ అంటే రెచ్చిపోడూ. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు రౌడీ స్టార్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి సిద్ధంగా ఉన్నారు. వారెవరో కాదు, రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, విదేశీ మోడల్ ఇసాబెల్లీ లీట్.