వాళ్ళకి గాలమేస్తోన్న కన్నడ కస్తూరి రష్మిక.!

మరిన్ని వార్తలు

కన్నడ కుట్టీ రష్మికా మండన్నా కొంటె పిల్లే కాదు.. చాలా గడుసు పిల్ల కూడా. ఈ అమ్మడిని అదృష్టం బబుల్‌గమ్‌ పట్టినట్లు పట్టేసినట్లుంది. ఫ్లాప్‌ వచ్చినా క్రేజ్‌ తగ్గడం లేదు. అలాంటిది ‘సరిలేరు నీకెవ్వరు’తో హిట్‌ కొట్టింది. ఇక ఈ భామని పట్టుకోవడం ఎవ్వరి తరమూ కాకపోతోంది. మరి కొద్ది రోజుల్లో ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే కెరీర్‌కి స్ట్రాంగ్‌ బేస్‌మెంట్‌ వేసేసుకుంటోంది. టాలీవుడ్‌లో మోస్ట్‌ స్ట్రాంగ్‌ పర్సన్స్‌కి తనదైన స్టయిల్లో గాలమేస్తోంది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేసేసింది. నెక్స్‌ట్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో వర్క్‌ చేస్తోంది.

 

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో మరో కొత్త ప్రాజెక్ట్‌కి లైన్‌ క్లియర్‌ చేసేసుకుంది. ఇక స్టార్‌ డైరెక్టర్‌ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ నోటి వెంట మాటే రానీయకుండా చేసేసింది. ఆయన ఏదో మాట్లాడుతుండగా మధ్యలోనే ఆపేసి, ‘త్రివిక్రమ్‌గారూ.. కొంచెం నన్ను గుర్తు పెట్టుకోండీ..’ అంటూ ఆయన సినిమాలో తనకు ఛాన్సివ్వమని డైరెక్ట్‌గా అడిగేసింది. అంతలా అడిగితే, త్రివిక్రమ్‌ మర్చిపోతాడా.? అసలే వేద వేదాంగాలు చదివేసిన జ్ఞాని. ఆయనకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. పైగా, రష్మిక లాంటి ఎనర్జిటిక్ హీరోయిన్లకు త్రివిక్రమ్ కథలు భలేగా సూటవుతాయి. ఏమో తన తదుపరి సినిమాలో రష్మికకు ఆఫర్‌ ఇచ్చేసినా ఇచ్చేస్తాడు. వీళ్లే కాదు, కనిపించిన ప్రతీ ఒక్కర్నీ డైరెక్ట్‌గా ఆఫర్స్‌ అడిగేస్తోందీ ముద్దుగుమ్మ. అన్నట్లు పాప లిస్టులో వెంకీ అట్లూరి వంటి యంగ్‌ డైరెక్టర్స్‌ కూడా ఉన్నారండోయ్‌. మొత్తానికి రష్మిక తీరు చూస్తుంటే, ఏకంగా టాలీవుడ్‌ని ఫుల్‌గా దున్నేసే వరకూ వదిలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్స్‌ లిస్టులో పూజా హెగ్దే, రష్మికా మండన్నా పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయి. పూజాతో పోల్చితే రష్మిక.. అబ్బో ఆన్‌ స్క్రీన్‌తో పాటు ఆఫ్‌ స్క్రీన్‌ కూడా హైపర్‌ యాక్టివ్‌ సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS