ర‌ష్మిక మ‌ళ్లీ ల‌వ్ లో ప‌డిందా?

By iQlikMovies - May 16, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది ర‌ష్మిక‌. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం కంటే అభిన‌యానికే ప్రాధాన్యం ఇస్తూ.. యువ హృద‌యాల‌తో పాటు, కుటుంబ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్నీ గెలుచుకుంది. ఆ ర‌ష్మిక ఇప్పుడు ల‌వ్ లో ప‌డింద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓ యువ హీరోతో ర‌ష్మిక క్లోజ్‌గా ఉంటోంద‌ని టాక్‌. వీరిద్ద‌రూ క‌ల‌సి ఇది వ‌ర‌కు ఓ సినిమా చేశారు.

 

అప్ప‌టి నుంచీ ఇద్ద‌రికీ క్లోజ్ నెస్ పెరిగింద‌ని, ఇప్పుడు మ‌రింత డీప్‌లోకి వెళ్లిపోయార‌ని టాక్‌. అన్న‌ట్టు ర‌ష్మిక గ‌తంలోనూ ఓ ల‌వ్ స్టోరీ న‌డిపింది. క‌న్న‌డ ద‌ర్శ‌కుడ్ని ప్రేమించింది. ఇద్ద‌రికీ నిశ్చితార్థం కూడా జ‌రిగింది. కానీ అంత‌లోనే బ్రేక‌ప్ అయిపోయింది. ఇప్పుడు మ‌రోసారి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయింది. ఈ క‌థైనా సుఖాంతం అవుతుందా? లేదంటే... తొలి ప్రేమ క‌థ‌లా బెడ‌సి కొడుతుందా? చూడాలి మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS