రష్మిక చెవిలో నితిన్‌ కాలీప్లవర్‌.!

By Inkmantra - February 07, 2020 - 09:41 AM IST

మరిన్ని వార్తలు

అదేంటి ఈ చెవిలో పువ్వుల గోలేంటీ.? అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే. రష్మికా మండన్నా - నితిన్‌ జంటగా ‘భీష్మ’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి మొన్నీ మధ్యనే ఓ సాంగ్‌ ప్రోమో రిలీజైంది. సూపర్‌ హిట్‌ అయ్యింది. ప్రోమోలో రష్మిక క్యూట్‌ క్యూట్‌ డాన్సులు, లిరిక్స్‌లోని కొత్తదనం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఇక మరో సింగిల్‌ని రిలీజ్‌ చేయనున్నారు. ఇది కూడా సమ్ థింగ్ స్పెషలే. ‘సరా సరి..’ అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌ని ఈ నెల 9న రిలీజ్‌ చేయనున్నారు.

 

ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదో కాలీ ఫ్లవర్‌ తోట. ఆ తోటలో హీరోయిన్‌, ఆ వెనకే హీరో. హీరోయిన్‌ చేతిలో ఓ కాలీ ఫ్లవర్‌ ఉంది. ఆ వెనకే ఉన్న హీరో కూడా కాలీ ఫ్లవర్‌ పట్టుకుని హీరోయిన్‌కి ఇవ్వాలని తిరుగుతున్నాడు. పాపం హీరోయిన్‌ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. అదీ పోస్టర్‌ కథ. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ అయితే, భలే కిక్కిస్తోందిలే. ఆ మాటకొస్తే, ‘భీష్మ’ తొలి పోస్టర్‌ నుండీ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తూనే ఉంది. కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని పోస్టర్స్‌ ద్వారా చెప్పకనే చెప్పే ప్రయత్న చేస్తున్నారు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మహతీ సాగర్‌ మ్యూజిక్‌ కంపోజేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. ఈ నెల 21న ‘భీష్మ’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS