కొన్ని సినిమాలు ఆ టైపు ప్రమోషన్స్‌తోనే సక్సెస్ అయ్యాయి. అర్జున్‌రెడ్డి అదే తరహా మూవీ. నిన్న వచ్చిన 'ఆర్‌ఎక్స్ 100' అదే తరహా మూవీ. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఈ ముద్దుల గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నాం. సినిమాలో కంటెన్ట్ ఏముంది అనే విషయం పక్కన పెడితే, 'రా' కంటెన్ట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ ప్రభంజనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.
ఇలాంటి రా కంటెన్ట్ విషయంలో అస్సలే మాత్రం మొహమాట పడని నటీ నటులు విషయమున్నా లేకపోయినా, 'అ'లాంటి కాన్సెప్ట్‌లు వెరసి తెలుగు సినిమాని కొత్త దారిలో పరుగులు పెట్టించేస్తున్నాయి. అన్ని సినిమాలు కాదు కానీ, కొన్ని సినిమాలు నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నాయి. 'బిజినెస్‌మేన్' సినిమాలో ఓ పాటలో డాన్సర్లు అరకొర దుస్తుల్లో కనిపిస్తే దాన్ని సెన్సార్ ఒప్పుకోలేదు. ఇలాంటి చాలా సందర్భాలున్నాయి. సెన్సార్ బోర్డ్ అది భరించలేక దర్శక, నిర్మాతలు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి.
ఇప్పుడేమో 'బరితెగింపు' అనే స్థాయిలో కంటెన్ట్ హద్దులు దాటేస్తోంది. ట్రెండ్ మారిందని సరిపెట్టుకోవాలో, బాక్సాఫీస్ పంట పండుతుందని ఆనందించాలో అర్ధం కావడం లేదు. పైన ఫోటో చూస్తున్నారుగా. క్రియేటివిటీ అదిరిపోయింది. లిప్‌కిస్‌ల్లో ఇదో కొత్త భంగిమ. వైరల్ అయిపోయిందిప్పుడిది.
'రధం' సినిమాకి సంబంధించిన ఈ స్టిల్ ఈ సినిమాకి వసూళ్ల పంట పండిస్తుందా? వేచి చూడాలిక.