యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ఇటీవల గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన 'రాక్షసన్' మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ నటిస్తున్న 'సీత' సినిమా సెట్స్‌పై ఉండగానే ఈ సినిమాని పట్టాలెక్కించేశాడు బెల్లంకొండ. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
నిజానికి ఈ సినిమాని ఈ పాటికే విడుదల చేయాల్సి ఉంది. ఎందుకో ఆలస్యమవుతూ వచ్చింది. ఈ లోగా 'రాక్షసన్' తెరపైకి రావడమే కాదు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాంతో 'సీత' కన్నా ముందే ఈ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట అని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా.? ఎందుకిలా జరిగింది.? అంటే కారణాలు పూర్తిగా తెలియవు. 'సీత' టీమ్ స్పందిస్తే కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు. మరోవైపు 'రాక్షసన్' రీమేక్‌లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జరుగుతోంది.
గతేడాది బెల్లంకొండ నటించిన 'సాక్ష్యం', 'కవచం' సినిమాలు కొద్ది నెలల గ్యాప్‌లో రిలీజయ్యాయి. అలాగే ఈ ఏడాది కూడా ఈ రెండు సినిమాల్నీ త్వరలోనే విడుదల చేసే యోచనలో బెల్లంకొండ ఉన్నాడనీ ఆయన సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారమ్. చూడాలి మరి బెల్లంకొండ డబుల్ ధమాకా ఇస్తాడా.? లేక ప్రచారంలో ఉన్నట్లు 'సీత'ని పక్కన పెట్టేసి, 'రాక్షసన్' రీమేక్‌పై బెల్లంకొండ దృష్టి పెట్టాడా.? తెలియాల్సి ఉంది.