కాస్టింగ్ కౌచ్ పేరుతో ఆ మధ్య మీడియాలో హల్చల్ చేసిన మాజీ హీరోయిన్ తనూశ్రీదత్తా మరోసారి హాట్ హాట్‌గా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై ఆరోపణలు చేసిన తనూశ్రీదత్తా రావల్సినంత పబ్లిసిటీ రాబట్టింది. అయితే తనూశ్రీ ఇన్సిప్రేషన్‌తో చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల్ని ధైర్యంగా బయటపెట్టేందుకు ముందుకొచ్చారు.
అంతేకాదు ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో నానాపటేకర్ తదితర నటులు, దర్శకులపై వేటు కూడా బాగానే పడింది. మరికొందరిపై చట్టపరమైన కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత తనూశ్రీ దత్తా జాడ లేదు. విదేశాలకు వెళ్లిపోయింది. అక్కడ సైలెంట్‌గా 'ఇన్స్ప్రేషన్' అనే ఓ షార్ట్ ఫిలిం తీసేసింది. దాంతో మళ్లీ లేటెస్ట్గా తెరపైకి వచ్చిన తనూశ్రీదత్తా త్వరలోనే ఈ షార్ట్ ఫిలిమ్‌ని రిలీజ్ చేయనున్నానని ప్రకటించింది.
బాలీవుడ్ లైంగిక వేధింపులే టార్గెట్‌గా ఈ షార్ట్ఫిలిమ్ని రూపొందించిందట తనూశ్రీ దత్తా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ షార్ట్ ఫిలిమ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందట. సినిమాల్లోకి కొత్తగా వచ్చే అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయనే అంశాల్ని కీలకంగా ఈ షార్ట్ ఫిలింలో చూపించిందట. అయితే ఈ షార్ట్ ఫిలింలో తనూశ్రీ నటించిందా.? లేదా.? అనేది విడుదలైతే కానీ తెలీదు.