దొంగా పోలీస్ టాస్క్‌లో జరిగిన తొందరపాటుకు, నేనే అనవసరంగా తప్పు చేశాను. కొంచెం సేపు నా బుద్ది వాడి ఉండాల్సింది. అంత పెద్ద తప్పిదం జరిగి ఉండేది కాదు.. అంటూ పునర్నవి భూపాళం వద్ద రవి కృష్ణ బాధపడ్డాడు. 'నువ్వు తప్పు చేయడమేంట్రా.. తప్పంతా తనదే..' అంటూ శ్రీముఖిపైనే నేరం నెట్టే ప్రయత్నం చేస్తూ, రవికృష్ణని మోటివేట్ చేసేలా మాట్లాడింది పునర్నవి. టాస్క్‌ల్లో నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్. అంతేకానీ వేరే వాళ్ల ఇన్‌ఫ్లూయెన్స్‌తో నువ్వు పని చేయకు.
నీ మనసుకు నో అనిపిస్తే, నో.. యస్ అనిపిస్తే యస్.. అంతే. కానీ, వేరే వాళ్ల కోసం నువ్వు నీ ఆటిట్యూడ్‌ని మార్చుకోకు.. అంటూ కొంచెం గట్టిగానే క్లాస్ పీకింది రవికృష్ణకి. ఇంతవరకూ రవికృష్ణపై ఎలాంటి ఆరోపణలు లేవు హౌస్‌లో. మిస్టర్ క్లీన్‌గా ఉన్నాడు. అలాంటి రవికృష్ణని అనసవసరంగా బలి చేసేసిందనే నింద శ్రీముఖిపై పడింది. ఈ అభిప్రాయం హౌస్‌మేట్స్‌లోనే కాదు, బయటి నుండి కూడా అందరిలోనూ గట్టిగా నాటుకుపోయింది. పునర్నవి, రాహుల్, వితికా షెరూ, వరుణ్ సందేశ్ గ్రూప్‌లోకి రవికృష్ణ కూడా చేరిపోయినట్లుగా ఈ సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.