అవును.. అదుగో.. ఇప్పుడు 'ఆవిరి'!

మరిన్ని వార్తలు

అతన్ని సినిమాల్లో కమెడియన్‌గా చూశాం. కరడు గట్టిన విలన్‌ పాత్రల్లోనూ చూశాం. దర్శకుడిగానూ అతని సినిమాల్ని చూసి ఎంజాయ్‌ చేశాం. విలన్‌గానో, కమెడియన్‌గానో సెటిలైపోయి వుంటే స్టార్‌డమ్‌ దక్కి వుండేదే. కానీ, తనదైన శైలిలో విలక్షణమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలనే అతని తపనకి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాలి. అతనే రవిబాబు. 

 

తొలి సినిమా 'అల్లరి'నే ఇంటి పేరుగా మార్చేసుకున్న అల్లరి రవిబాబు నుంచి మరో సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరు 'ఆవిరి'. బాటిల్‌లో ఓ అందాల భామ వయ్యారంగా హొయలు ఒలకబోసేస్తోంది ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌లో. బాటిల్‌, ఆ సెటప్‌ అంతా చూస్తే ఇదొక దెయ్యాల సినిమా అనే భావన కలగడం సహజమే. ఈ తరహా సినిమాలు రవిబాబుకి కొత్తేమీ కాదు. 'అవును' సిరీస్‌లో రెండు సినిమాలు చేశాడు.. మెప్పించాడు కూడా. 

 

ఇటీవలే 'అదుగో' అంటూ పంది పిల్లతో సినిమా తీసిన రవిబాబు, ఆ సినిమాతో విజయాన్ని అయితే అందుకోలేదుగానీ, విలక్షణ ప్రయత్నం చేసి భళా అన్పించాడు. అంచనాలకు మించి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఈ 'ఆవిరి'లో వుంటాయట. అవేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ మధ్య రవిబాబు నుంచి 'అ' అక్షరంతోనే ఎక్కువగా టైటిల్స్‌ వస్తున్నాయి. ఆ కోవలోనే వస్తోన్న 'ఆవిరి'తో రవిబాబు మళ్ళీ సత్తా చాటుతాడా.? వేచి చూడాల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS