రవిబాబుతో రాజుగారి మ్యాజిక్‌!

మరిన్ని వార్తలు

నా రూటే సెపరేటు అంటాడు ఆ డైరెక్టర్‌. కనీ వినీ ఎరుగని కాన్సెప్ట్‌లు, ప్రాపర్టీలు తన సినిమాల్లో భాగం చేసేస్తాడు. రాజమౌళి ఈగను హీరోగా పెట్టి సినిమా చేస్తే లేదు కానీ, నేను పందిపిల్లని హీరోగా పెట్టి సినిమా చేస్తే తప్పా? అంటూ 'అదుగో' సినిమాని తెరకెక్కించాడు. తొలి సినిమా 'అల్లరి' నుండీ డిఫరెంట్‌ పంథాని ఫాలో చేస్తున్నాడు రవిబాబు. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా, రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మేట్‌కి దూరంగా ఆయన సినిమాలుంటాయి. లేట్‌గా అయినా, లేటెస్ట్‌గా సినిమాలు రూపొందిస్తుంటాడు.

 

తాజాగా ఆయన నుండి వస్తోన్న మరో విభిన్న కథా చిత్రం 'ఆవిరి'. కథా కమామిషు ఏంటనేది ఇంకా తెలీదు కానీ, ఖచ్చితంగా ఏదో థ్రిల్లర్‌ జోనర్‌ అని తెలుస్తోంది ఫస్ట్‌లుక్‌ని బట్టి. ఓ ప్రెషర్‌ కుక్కర్‌లో నుండి భయంకరంగా చూస్తున్న కళ్లు.. ఈ లుక్‌లో చూపించారు. ఎప్పటిలాగే ఫస్ట్‌లుక్‌ ఆసక్తికరంగా ఉంది. అఫ్‌కోర్స్‌ సినిమాలో విషయం కూడా అలాగే ఉంటుందనుకోండి. నేహా చౌహాన్‌, భరణి శంకర్‌, శ్రీ ముక్తా, ముక్తర్‌ ఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రవిబాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట.

Image result for aaviri

చాలా సర్‌ప్రైజింగ్‌ రోల్‌ అనీ తెలుస్తోంది. ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై దిల్‌ రాజు హ్యాండ్‌ కూడా పడింది. సినిమాలో విషయం నచ్చి విడుదల చేసేందుకు రాజుగారు ముందుకొచ్చారట. రాజుగారిని ఇంప్రెస్‌ చేసిందంటే, సినిమాలో ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది. రాజుగారికి నచ్చిందంటే, ఆడియన్స్‌నీ మెప్పింస్తుంది. మెప్పించిందా? లేదా? తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS