ఈ మధ్య టాలీవుడ్‌లో దుమారం రేపిన కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ అంచులు దాటి, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు, రాజకీయ అంచులు కూడా తాకింది. అయితే సమస్య మాత్రం పరిష్కారమయ్యేది కాదు కానీ, లేటెస్టుగా పలువురు మగవాళ్లు కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులమంటూ బయటికి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తాజాగా 'రేసుగుర్రం' తదితర సినిమాల్లో విలన్‌గా నటించిన రవికిషన్ 'కాస్టింగ్ కౌచ్'కి బాధితులు కేవలం కొంత మంది ఆడవాళ్లు మాత్రమే కాదు, మగవాళ్లు కూడా ఉన్నారు. గతంలో పలువురు హీరోలు కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారు అని ఆయన అన్నారు. అయితే అవకాశాల కోసం కాంప్రమైజ్ కాకూడదు. అలాగైతే, మన టాలెంట్ నిజం కాకుండా పోతుంది.
అలా వక్రమార్గంలో అవకాశాలు అందుకోవడం వల్ల మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఆ కాస్టింగ్ కౌచ్ వల్లే అవకాశాలు దక్కించుకున్నామన్న మచ్చ ఏర్పడుతుంది. అలా సాధించిన క్రెడిట్ అసలు సిసలు క్రెడిట్ అనిపించుకోదు అని రవికిషన్ అన్నారు. రవికిషన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే, గతంలో కంగనా, రాధికా తదితర బాలీవుడ్ నటీమణులు పురుషులపై కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అలాంటి వారికి సపోర్టివ్‌గా నిలిచారు. అయితే తాజాగా రవికిషన్ వంటి ఓ భారతీయ నటుడు మగవారిపై కాస్టింగ్ కౌచ్ గురించి ఇలా మాట్లాడడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా, ఆలోచింపచేసేలా ఉంది.