SIT విచారణతో ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకరకమైన టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రోజుకొక సెలబ్రిటీ సిట్ విచారణకి వస్తుండడం వారు వచ్చిన సందర్భంలో మీడియా దానిని బాగా ప్రమోట్ చేస్తుండడం సదరు సెలబ్రిటిలకి ఒకింత ఇబ్బందికి గురవుతున్నారు.
ఇదే తరుణంలో రేపు విచారణకి హాజరుకానున్న రవితేజ పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఇప్పటికే ఆయన తమ్ముడి చివరిచూపుకు కూడా రాలేదు అనే నింద ఆయన పై ఉండగా తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో ఆయన పేరు బయటకి రావడంతో న్యూస్ లో హాట్ పర్సన్ గా మారిపోయాడు.
ఇక రేపు విచారణకి వచ్చే సమయంలో ఆయన వెంట తన వ్యక్తిగత లాయరుని తెచుకోన్నున్నాడని అలాగే ఆయన ఏ చోటునుండి విచారణకి వస్తాడు అనే విషయం కూడా గోప్యంగా ఉంచబోతున్నట్టు సమాచారం.
మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని రేపు విచారణకి హాజరుకానున్న సందర్బంలో రేపు ఏం జరగనుంది అనే దాని పై సస్పెన్స్ కొనసాగుతున్నది.