సెకండ్ ఇన్నింగ్స్‌లో రవితేజ చాలా మారిపోయారు. కాస్త ప్రయోగాల దిశగా పయనిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన కొన్ని ఫెయిల్యూర్స్‌ని చవి చూడాల్సి వచ్చింది. 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం పూర్తిగా మాస్‌రాజా మార్క్ మూవీ అట. అందులో ఎలాంటి ప్రయోగాలు లేవంటున్నాడు. తన నుండి ఫ్యాన్స్ ఎలాంటి స్టఫ్ ఆశిస్తారో పుష్కలంగా అలాంటి స్టఫ్ లభిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు రవితేజ.
మాస్‌రాజా అన్న ఇమేజ్‌కి ఇకపై ఎప్పుడూ డ్యామేజ్ అయ్యే ప్రయత్నాలు చేయనంటున్నాడు అంటే, ప్రయోగాల జోలికి పోనని ఇన్‌డైరెక్ట్‌గా మాస్‌రాజా కన్‌ఫామ్ చేసేశాడు. ఇకపోతే ప్రజెంట్ సినిమా ఈక్వేషన్స్ ఛేంజ్ అయిపోయాయి. ఆడియన్స్ ఆలోచనా ధోరణి మారిపోయింది. కథలో విషయం ఉంటే, ఇమేజ్‌కీ, స్టార్‌డమ్‌కీ సంబంధం లేకుండా బ్రహ్మరథం పట్టేస్తున్నారు. అలా ఈ మధ్య హిట్ అయిన సినిమాల లిస్టు పెద్దదే ఉంది. ఈ తరుణంలో రవితేజ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం సమంజసమేనా.? ఏమో ఆయనకే తెలియాలి.
'అమర్ అక్బర్ ఆంటోనీ' విషయానికి వస్తే పక్కా కమర్షియల్ మూవీ అట. అక్కడక్కడా అవాక్కయ్యే సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకుల్ని ఆధ్యంతం ఉత్కంఠకు గురి చేస్తాయట. అలాగే మూడు వేరియేషన్స్‌లో రవితేజ పర్‌ఫామెన్స్, ఇలియానా గ్లామర్, సునీల్ కామెడీ ఇలా ప్రతీ అంశం ప్రేక్షకున్ని కుర్చీకి అతికించేస్తుందని రవితేజ చెబుతున్నారు.
శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' మరి కొన్ని గంటల్లోనే ధియేటర్స్‌లో సందడి చేయనుంది.