ట్రిపుల్‌ 'ఎ' గురించి తాజా అప్‌డేట్‌ ఏంటంటే.!

By iQlikMovies - September 10, 2018 - 16:39 PM IST

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'. శీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఫ్రెష్‌ అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. 

అదేంటంటే, ఇంతవరకూ ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడనే భావనలోనే ఆడియన్స్‌ ఉన్నారు. అయితే కాదట. సింగిల్‌ రోలే కానీ, మూడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ చూపించబోతున్నాడట తన పాత్రలో. ఇది ఓ రకమైన డిజార్డర్‌ అట. ఈ డిజార్డర్‌తోనే మూడు రకాల స్వభావాలున్న వ్యక్తిగా రవితేజ కనిపిస్తాడనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇలియానా నటిస్తోంది. 

రవితేజ మూడు పాత్రలైతే, ఇలియానాతో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు కూడా వినిపించాలి. కానీ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యి చాలా కాలమే అయినప్పటికీ, మిగిలిన హీరోయిన్స్‌ మాట వినిపించడం లేదంటే, ఈ తాజా ప్రచారంలో నిజం లేకపోలేదు. గతంలో రవితేజ, ఇలియానా కలిసి నటించిన 'కిక్‌' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. చాలా గ్యాప్‌ తర్వాత ఇలియానా ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ రీ ఎంట్రీ మూవీ 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ఇలియానాకి ఇదివరకటి క్రేజ్‌ సంపాదించి పెడుతుందేమో చూడాలిక. 

ఇకపోతే రవితేజ - శీను వైట్ల కాంబినేషన్‌కి సక్సెస్‌ మార్కు ఉంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా సక్సెస్‌ ఇటు రవితేజకు, అటు శీను వైట్లకు కూడా కీలకమే. దసరాకి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS