'గురు' సినిమాతో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ రితికా సింగ్. ఆ తర్వాత తెలుగులో ఈ భామ ఎక్కడా కనిపించలేదు కానీ, తమిళంలో లారెన్స్‌తో 'శివలింగా' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. చి డాన్సర్. మంచి యాక్ట్రెస్. క్యూట్ ఫీచర్స్‌తో భలే ఎట్రాక్ట్ చేస్తుంది.
తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఈ క్యూట్ బేబీకి చోటు దక్కినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తేజు కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్‌యూ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తేజుకీ జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. సూపర్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా, తేజు 'నేనే శైలజ' ఫేం కిషోర్ తిరుమలతో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇది కూడా ప్రేమ కథా చిత్రమేనట. త్రీ డైమన్షియల్‌లో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కబోతోందనీ సమాచారమ్.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. ఆల్రెడీ ఓ హీరోయిన్‌గా 'హలో' ఫేం కళ్యాణీ ప్రియదర్శన్‌ని ఎంచుకున్నారు. మరో హీరోయిన్‌గా 'గురు' పాప రితికా సింగ్ పేరు వినిపిస్తోంది. ఇంకా కన్‌ఫామ్ చేయలేదు కానీ, ఈ బ్యూటీ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఈ మధ్య కొంచెం బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ కష్టపడి బరువు తగ్గించి సన్నబడింది. ఆ ఫోటోలు ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారాయి కూడా. ఒకవేళ తేజు సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కోసమే అమ్మడు బరువు తగ్గిందేమో. ఈ టాక్ నిజమే అయితే రితికా సింగ్ పంట పండినట్లే.!