కెరీర్ లో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్ తాజాగా గృహం అంటూ మనముందుకి వచ్చేశాడు. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక తెలుగు మీడియా కోసం ప్రత్యేక షోని నిన్న ఏర్పాటు చేసిన సిద్ధార్థ్ ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తాను ఈ చిత్రాన్ని చాలా ప్రేమించి చేశాను అని అలాగే ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా తాను ఎప్పుడు కింద పడిపోలేదు అని ప్రేక్షకులకి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే తన ప్రయత్నం ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది అని వివరించాడు.
ఇదిలావుండగా సిద్ధార్థ్ గృహం చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ ఇవ్వమని సెన్సార్ వారిని కోరాడట. ఇది హారర్ చిత్రమని అందుకే పెద్ద వారు మాత్రమే చూస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు.