ర‌వితేజ క‌థ‌తో 'ఢీ' కొడుతున్నారా?

By Gowthami - June 17, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

శ్రీ‌నువైట్ల ఇప్పుడు ఓ హిట్టు కోసం ప‌రిత‌పిస్తున్నాడు. ఎలాగైనా స‌రే, మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని ప‌రిత‌పిస్తున్నాడు. విష్ణుతో `ఢీ` సీక్వెల్ చేసి, మ‌ళ్లీ త‌న మార్క్ వేయాల‌న్న‌ది త‌న ప్లాన్‌. దీనికి `డీ అండ్ డీ` అనే పేరు కూడా పెట్టారు. అంటే.. డేరింగ్ అండ్ డాషింగ్ అన్న‌మాట‌. స్క్రిప్టు రెడీ అయిపోయింది కూడా. అయితే నిజానికి ఈ క‌థ ర‌వితేజ కోసం సెట్ చేసింద‌ట‌. ర‌వితేజతో ఇది వ‌ర‌కు `దుబాయ్ శీను` తీశాడు శ్రీ‌నువైట్ల అది మంచి హిట్ అయ్యింది. ఆ త‌ర‌వాత చేసిన `అమ‌ర్ అక్బ‌ర్ అంటోనీ` అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. నిజానికి ఆ స‌మ‌యంలోనే ర‌వితేజ‌కు మ‌రో ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌థ చెప్పిన‌ట్టు స‌మాచారం. దాన్ని ర‌వితేజ పక్క‌న పెట్టాడు.

 

ఇప్పుడు అదే క‌థ‌కు ఇంకాస్త మ‌సాలా, వినోదం జోడించి `డీ అండ్ డీ` స్క్రిప్టు సిద్ధం చేశాడ‌న్న‌మాట‌. ర‌వితేజ నో చెప్పిన క‌థ.. విష్ణుకి తెగ న‌చ్చేయ‌డంతో ఢీ సీక్వెల్ ప‌ట్టాలెక్క‌డానికి మార్గం సుగ‌మం అయ్యింది. ఢీలో శ్రీ‌హ‌రి ఓ కీల‌క పాత్ర పోషించారు. అలాంటి ఓ పాత్ర ఇందులోనూ ఉంద‌ట‌. అందులో మ‌రో హీరో క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఆ హీరో ఎవ‌రో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS