రవితేజ దగ్గర ఓ కంప్లైంట్ ఉంది. సినిమాలు ఫ్లాప్ అయ్యే కొద్దీ రెమ్యునరేషన్లు పెంచుకొంటూ పోతాడని. అంతే కాదు.. ముందు ఒప్పుకొన్నదే కాకుండా, ఎగస్ట్రా ఇమ్మని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తాడని, అందుకు ఒప్పుకోకపోతే.. షూటింగులకు సహకరించడని టాక్. `ఖిలాడీ` విషయంలో ఇదే జరిగింది. ఆ తరవాత వచ్చిన... `రామారావు ఆన్ డ్యూటీ`కీ ఇదే పరిస్థితి. ఆ రెండు సినిమాలూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినా రవితేజ మారలేదు. ఇప్పుడు చేస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` విషయంలోనూ అదే సీన్ రిపీట్ చేస్తున్నాడు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. ఓ దొంగ బయోపిక్ ఇది. స్టువర్టు పురంలో... పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు.
తనని అంతా టైగర్ అని పిలుస్తారు. తన బయోపిక్ ఇది. ఇందులో రవితేజ హీరో. షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం రవితేజకు రూ.18 కోట్లు ఇస్తామని ముందు కమిట్ అయ్యారు నిర్మాతలు. కొంత మేర షూటింగ్ జరిగాక.. అదనంగా మరో రెండు కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాడట. అంటే... రెమ్యునరేషన్ మొత్తం రూ.20 కోట్లు. రవితేజ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఇందుకోసం ఇది వరకెప్పుడూ లేనన్ని కాల్షీట్లు కేటాయించాల్సి వస్తోందట. అందుకే.. రవితేజ సడన్ గా పారితోషికం పెంచేశాడని టాక్ వినిపిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఎవరైనా అందుకోవాల్సిందే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే... ఇలా సినిమా మధ్యలో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం... సవ్యంగా లేదు. ఈ విషయంలో రవితేజ ఆలోచించుకొంటే మంచిది.