ఓటీటీలు వచ్చాక... టాలీవుడ్ నిర్మాతలకు అదనపు ఆదాయ మార్గం మరోటి ఏర్పడినట్టైంది. శాటిలైట్ తో సహా.. ఓటీటీ రైట్స్ రూపంలోనూ భారీ ఆదాయం లభిస్తోంది. సినిమాని థియేటర్లో కంటే ముందు ఓటీటీలోనే విడుదల చేస్తే ఓ రేటు. థియేటర్లో విడుదల అయిన తరవాత.. ఓటీటీలో వేసుకుంటే మరో రేటు. మొత్తానికి.. నిర్మాతలకు కాసుల వర్షం కురవడం ఖాయం.
తాజాగా రవితేజ సినిమా `ఖిలాడీ` ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయ్యింది. అమేజాన్‌కి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమ్మేశారు. దాదాపు 6 కోట్ల వరకూ గిట్టుబాటు అయ్యిందని టాక్. అయితే.. ముందుగా ఈ సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఆ తరవాతే... ఓటీటీకి లో చూడొచ్చు. ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు మళ్లీ తెరచుకుంటే.. ముందుకొచ్చే సినిమాల్లో ఖిలాడీ ముందు వరుసలో ఉంటుంది.