ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మాస్ రాజా రవితేజ ఇప్పుడు మూస కథలతో విసిగిస్తున్నాడన్న టాక్ తెచ్చుకున్నాడు. రవితేజ రీ ఎంట్రీలో ఒకటీ అరా తప్ప, పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు సరికదా.. సేమ్ మ్యానరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తున్నాడు.. అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు ప్రాజెక్టున్నాయి. అందులో ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్’. ఈ సినిమాతో ఫేడవుట్ హీరోయిన్ శృతిహాసన్‌కి ఛాన్సిచ్చి, రవితేజ పెద్ద మనసు చాటుకున్నాడు. కానీ, ఇంతవరకూ రిలీజైన సినిమా ప్రోమోస్ మాత్రం ఫ్యాన్స్‌ని కలవరపెడుతున్నాయి. రెగ్యులర్ కంటెంట్‌తోనే ఈ సారీ రవితేజ డిజప్పాయింట్ చేస్తాడా.? అని అనుమానిస్తున్నారు అభిమానులు.
ఈ సినిమా సంగతిలా ఉంటే, మరో ప్రాజెక్ట్ నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో చేస్తున్నాడు రవితేజ. రవితేజ మార్కెట్ ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో ఈ సినిమా బడ్జెట్ విషయంలో కొంత లొల్లి జరుగుతోందని తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో సినిమాని కానిచ్చేద్దామనుకుంటున్నారట నిర్మాతలు. కానీ, రవితేజ అందుకు ఒప్పుకోవడంలేదనే గాసిప్ చక్కర్లు కొడుతోంది. నిజంగానే బడ్జెట్ విషయంలో రవితేజ లొల్లి చేస్తున్నాడా.? ఏమో. చిత్ర యూనిట్‌కే ఎరుక.