మాస్‌ రాజా ఫ్యామిలీ పిక్‌ చూశారా?

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్‌’. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఫ్యామిలీతో రవితేజ సరదాగా గడుపుతున్న పోస్టర్‌ ఇది. ఈ సినిమాలో రవితేజకి జోడీగా శృతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ కొడుక్కి తండ్రిగా రవితేజ కనిపిస్తున్నారు. కొడుకు, భార్యను ఎత్తుకుని నవ్వుతూ కనిపిస్తున్నాడు రవితేజ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌ కావల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా మధ్యలోనే షూటింగ్‌ ఆపేయడంతో, రిలీజ్‌ వాయిదా పడే అవకాశాలున్నాయి.

 

ఇకపోతే, లాంగ్‌ గ్యాప్‌ తర్వాత శృతిహాసన్‌ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే, వరుస ఫెయిల్యూర్స్ తో రవితేజ ఈ మధ్య నలిగిపోతున్నాడు. ‘క్రాక్‌’ ఆయనకు మంచి విజయం అందిస్తుందని ఆశిస్తున్నాడు. గోపీచంద్‌ - రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమా మేకింగ్‌ విషయంలో డైరెక్టర్‌ గోపీచంద్‌ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. చూడాలి మరి, వీరి కృషి ఫలిస్తుందో లేదో తెలియాంటే కరోనా పరిస్థితులు చక్కబడాలా.. సినిమా నిర్మాణం పూర్తి కావాలా.. ప్రేక్షకుల ముందుకు రావాలా.. అంత వరకూ వెయిట్‌ చేయాలా.. అంతేగా.. అంతేగా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS