తెలుగు సినిమాలో హాట్ హాట్ సీన్లు ఈమధ్య కామన్ అయిపోయాయి. విజయ్ దేవరకొండ లాంటి హీరో సినిమాల్లో అయితే.. లిప్ లాక్‌లు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కరోనా భయాలు మొదలయ్యాక.... వెండి తెరపై లిప్ లాక్‌లూ, శృంగార భరితమైన సన్నివేశాలు కనిపించవేమో .... అనుకున్నారంతా. కానీ... తెలుగు సినిమా ధోరణి మారలేదు. కరోనా కరోనానే.. లిప్పు లాక్కులు లిప్పులాక్కులే.. అని లైట్ గా తీసుకుంటున్నారు.
తాజాగా.. రవితేజ ఓ లిప్ లాక్ పెట్టేశాడు. రవితేజ హీరోగా ఖిలాడీ అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకుడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇటీవల రవితేజ - మీనాక్షి చౌదరిల మధ్య ఓ రొమాంటిక్ ట్రాక్ తెరకెక్కించారని సమాచారం. ఇందులో భాగంగా.. రవితేజ - మీనాక్షిలపై ఓ లిప్ లాక్ సీన్ చిత్రీకరించారని తెలుస్తోంది. రవితేజ ఇప్పటి వరకూ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించలేదు. కానీ.. సీన్ డిమాండ్ చేసింది కాబట్టి తప్పలేదట.