రవితేజ - కళ్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'నేల టికెట్టు'. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
రవితేజతో సినిమా చాలా కంఫర్ట్ అని డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ అంటున్నాడు. అందుకే రవితేజతో ఒక్కసారి కలిసి పని చేస్తే, మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది. స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి, యూనిట్‌తో బాగా కలిసిపోయే అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. డైరెక్టర్ ఫ్రెండ్లీ హీరో, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో రవితేజ. అందుకే ఆయనతో సినిమా అంటే చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది అని కళ్యాణ్‌కృష్ణ, రవితేజని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నాడు. ఈ కాంబినేషన్ అనగానే ఓ మోస్తరు అంచనాలు నమోదయ్యాయి మొదట్లో.
ఇటీవల విడుదలైన ట్రైలర్ చూశాక, ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ట్రైలర్‌లో డైలాగులు ఆడియన్స్‌ని కట్టిపడేస్తున్నాయి. 'ముసలితనం అంటే చేతకానితనం కాదు, నిలువెత్తు అనుభవం' అన్న డైలాగ్ మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అవుతోంది. ఇటీవలి కాలంలో రవితేజ సినిమాల్ని తీసుకుంటే వాటిల్లో స్పష్టమైన కొత్తదనం కన్పిస్తోంది. 'రాజా ది గ్రేట్' సినిమాలో అంధుడిగా నటించి మెప్పించాడు రవితేజ. ఆ తర్వాత 'టచ్ చేసి చూడు' అనే కమర్షియల్ సినిమా చేసిన మాస్ మహరాజా రవితేజ, 'నేలటిక్కెట్టు' సినిమాలో వృద్ధాప్యం గురించీ, ఆ వృద్ధాప్యం తాలూకు అనుభవం గురించీ చెప్పిన గొప్పతనం గురించీ చెప్పిన డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కమర్షియల్ హంగులతోపాటు సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రంగా 'నేల టిక్కెట్టు' గురించి చెబుతున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.