'ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం' అని రవితేజ చెప్పిన డైలాగ్ అందర్నీ టచ్ చేస్తోంది. ముసలితనానికి నిలువెత్తు అర్ధం చెప్పిన రవితేజ ఈ ఒక్క డైలాగుతోనే మార్కులు కొట్టేశాడు. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'నేల టికెట్'లోనిదీ డైలాగ్. లేటెస్టుగా ట్రైలర్ విడుదలైంది.
మాస్, లవ్, యాక్షన్, అఫెక్షన్ మేళవించిన అంశాలతో ట్రైలర్‌ని ఆశక్తిగా రూపొందించారు. వృద్ధులకు సాయం చేసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాలతో సక్సెస్ అందుకున్న కళ్యాణ్‌కృష్ణ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడనిపిస్తోంది. ట్రైలర్ టాక్ చాలా బాగుంది. ముద్దుగుమ్మ మాళవికా శర్మ ఈ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరచయమవుతోంది. ఈ ముద్దుగుమ్మ ఫ్రెష్ అందాలు సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి.
రవితేజ గతంలో మాదిరి పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే, జోవియల్‌గా తన మార్కు ఆటిట్యూడ్‌ని కనబరుస్తున్నాడు ఈ సినిమాలో. 'నా జీవితం నా ఇష్టం నేను ఎదగడానికి ఎంతమందినైనా తొక్కేస్తాను..' అంటూ జగపతిబాబు మరోసారి తన హ్యాండ్‌సమ్ అండ్ పవర్‌ఫుల్ విలనిజం చూపించబోతున్నాడు.
మొత్తానికి ట్రైలర్‌తో కట్టిపడేసిన రవితేజకు సెకండ్ ఇన్నింగ్స్‌లో 'నేల టికెట్' మరో మంచి సినిమా అవుతుందనిపిస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.