ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలు మాస్ రాజా రవితేజ నటించిన 'నేల టిక్కెట్టు' ఒకటి, యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'అమ్మమ్మగారిల్లు' మరొకటి. చిత్రమేంటంటే అమ్మమ్మ సెంటిమెంట్‌తో నాగశౌర్య వస్తున్నాడు. వృద్ధుల సెంటిమెంట్‌తో రవితేజ వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించిన కంటెన్ట్‌తోనే వస్తూ ఒకేరోజు పోటీ పడేందుకు రంగంలోకి దిగుతున్నారు.
రవితేజ సినిమా మాస్ సినిమా. నాగశౌర్య సినిమాలెలాగూ క్లాస్ టచ్‌తో ఉంటాయి. అయితే ఈ రెండింట్లోనూ కామన్ పాయింట్ వృద్ధుల సెంటిమెంటే. ప్రోమోస్ చూస్తుంటే, ఇటు అమ్మమ్మపై నాగశౌర్య చెప్పే డైలాగులు మనసుకు హత్తుకుంటున్నాయి. అటు వృద్ధులపై రవితేజ చెప్పే డైలాగులూ హార్ట్ టచ్చింగ్‌గానే అనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య అగ్ర హీరోల సినిమాలే వారం రోజుల టైం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్నాయి. నిర్మొహమాటంగా అగ్ర హీరోలు కాస్త ముందు వెనకా అయినా కానీ, తమ తమ సినిమాలు క్లాష్ కాకుండా చూసుకుంటున్నారే తప్ప ఒకేసారి పోటీ పడేందుకు ఇష్టపడడం లేదు.
అలాంటిది చిన్న సినిమాల విషయంలో తొందరెందుకు? అని నాగశౌర్య 'అమ్మమ్మగారిల్లు' రిలీజ్‌పై విమర్శలు వస్తున్నాయి. రవితేజ 'నేల టికెట్టు'కు కనీసం రెండు రోజుల గ్యాప్ అయినా తీసుకోవాల్సిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎవరి దారి వారిదే. కంటెన్ట్ బాగుంటే, రెండు సినిమాలకూ హిట్ దక్కుతుంది. లేదంటే, కంటెన్ట్‌ని బట్టి రేస్‌లో విన్ అయ్యేది ఎవరో ఒక్కరే కావచ్చు.