'కిలాడీ'గా మాస్ మ‌హరాజా!

మరిన్ని వార్తలు

ర‌వితేజ - ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌. ఈ వేస‌విలోఈనే షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రానికి 'కిలాడీ' అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం అందుతోంది. ర‌వితేజ - ర‌మేష్ వ‌ర్మ కాంబోలో ఇది వ‌ర‌కు ;'వీర‌' వ‌చ్చింది. ఆ సినిమా అంత‌గా ప్రేక్ష‌కాద‌ణ సాధించ‌లేక‌పోయింది. అయితే ఇటీవ‌ల 'రాక్ష‌సుడు'తో ఓ హిట్ కొట్టాడు ర‌మేష్ వ‌ర్మ‌. అందుకే ర‌వితేజ ర‌మేష్ వ‌ర్మ‌కి మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడు.

 

ఈ సినిమాలో ర‌వితేజ పాత్ర రెండు కోణాల్లో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఉంటార‌ని స‌మాచారం. వాళ్లెవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది. ప్ర‌స్తుతం 'క్రాక్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు ర‌వితేజ‌. ఇది పూర్త‌యిన వెంట‌నే 'కిలాడీ' ట్రాక్ ఎక్కుతుంది. ఈలోగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS