పోలీస్ పాత్రలు రవితేజకు బాగానే అచ్చొచ్చాయి. విక్రమార్కుడులో ఖాకీ డ్రస్సులో చింతాత అడేశాడు మాస్ మహరాజా. పవర్‌లోనూ పవర్ఫుల్ పాత్ర లో కనిపించాడు. ఇప్పుడు క్రాక్ కోసం మరోసారి యూనిఫామ్ వేసుకుంటున్నాడు. త్వరలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నాడు రవితేజ. ఈ చిత్రానికి `కిలాడీ` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులోనూ రవితేజ పోలీస్ అధికారిగానే కనిపిస్తారని సమాచారం.
కిలాడీలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడని, ఓ పాత్ర పోలీస్, మరో పాత్ర కిల్లర్ అని తెలుస్తోంది. కథ ఇది వరకే సిద్ధమైపోయింది. క్రాక్సినిమా ముగిసిన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. ఇటీవలే రాక్షసుడుతో ఓ హిట్టు అందుకున్నాడు రమేష్ వర్మ. ఆ ఉత్సాహంలోనే ఈ స్క్రిప్టునీ కమర్షియల్ వాల్యూస్‌తో తయారు చేశాడట. ఈసినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.