రవితేజ కథానాయకుడిగా మరో కొత్త సినిమా పట్టాలెక్కింది. దీనికి నక్కిన త్రినాథరావు దర్శకుడు. ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రానికి `ధమాకా` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. రవితేజ హీరోగా నటించిన `ఖిలాడీ` చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. `రామారావు - అన్ డ్యూటీ` షూటింగ్ జరుగుతోంది. దాంతో పాటుగా `ధమాకా` కూడా... పూర్తి చేసే అవకాశాలున్నాయి.
`ధమాకా`లో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్సుంది. వాళ్లెవరన్నది ఇంకా తేలలేదు. త్వరలోనే కథానాయికల పేర్లు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా 12కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నక్కిన త్రినాథరావుకి 3 కోట్లు, కథ అందించిన ప్రసన్నకుమార్ కి కోటి రూపాయల పారితోషికం ముట్టిందట. రవితేజకు వరుస ఫ్లాపులున్నా - తన పారితోషికం లో ఎలాంటి మార్పు లేదు. దానికి తోడు `క్రాక్` హిట్ తో కాస్త రేసులోకి వచ్చాడు. అందుకే పారితోషికం విషయంలో రాజీ పడడం లేదు.